యాడ్ రెస్పాన్స్ చూసి థ్రిల్ అయిన అఖిల్ అక్కినేని

Akhil-Akkineni

కీర్స్తి శేషులు అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కానున్న మరో యువ సంచలనం అఖిల్ అక్కినేని. అఖిల్ ‘మనం’ సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ ఆడియన్స్ ని మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాడు. త్వరలో తను నటించనున్న మొదటి సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం అఖిల్ అండ్ అక్కినేని ఫ్యామిలీ కథని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే అఖిల్ అక్కినేని హీరోగా సినిమా సైన్ చెయ్యకముందే టైటన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసి ఓ యాడ్ కూడా చేసేసాడు. అఖిల్ అక్కినేని, బాలీవుడ్ భామ కల్కి కొలిచేన్ కలిసి చేసిన ఈ యాడ్ ఇటీవలే విడుదలైంది. ఈ యాడ్ లో అఖిల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది చూసి అఖిల్ థ్రిల్ అయ్యాడు.

‘నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మరియు నన్ను ఇంతలా మెచ్చుకుంటున్నందుకు నా ధన్యవాదాలు. మీ ఎంకరేజ్ మెంట్ కి నేను కేవలం ఒక థాంక్స్ చెప్తే సరిపోదు.. లవ్ యు ఆల్’ అని అఖిల్ ట్వీట్ కూడా చేసాడు..

అఖిల్ టైటన్ యాడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – టైటన్ యాడ్

Exit mobile version