పూజా హెగ్డే కూడా హ్యాండ్ ఇచ్చిందా ?

Published on Sep 10, 2019 11:27 am IST

‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమాలో చాలమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరికీ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేసింది చిత్రబృందం. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పూజా డేట్లు ప్రస్తుతం ఖాళీ లేకపోవడంతో అఖిల్‌ సరసన నటించడం లేదట. దాంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది.

కాగా యంగ్ హీరోయిన్ కేతికా శ‌ర్మను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More