
అక్కినేని వంశం నుండి వస్తున్న మూడవ తరం యువ నటుడు అక్కినేని అఖిల్ తన తొలిచిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నాడు. వినాయక్ దర్శకత్వంలో చిత్ర బృందమంతా యూరప్, ఆఫ్రికా ప్రాంతాలలో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించే పనిలో వున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకడం విశేషం. ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్ర బృందం త్వరలో థాయ్ లాండ్ వెళ్లనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి మరో యువ నటుడు నితిన్ నిర్మాణం చేపట్టడం విశేషం. సాయేషా హీరోయిన్ గా పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ మరియ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.