డెబ్యూట్‌తోనే మంచి మార్కులు కొట్టేసిన ‘అఖిల్’!

డెబ్యూట్‌తోనే మంచి మార్కులు కొట్టేసిన ‘అఖిల్’!

Published on Nov 11, 2015 2:51 AM IST

akhil
‘అఖిల్’.. సగటు తెలుగు సినీ అభిమానిని గత కొంతకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన సినిమా. అక్కినేని వంశంలో మూడో తరం నుంచి అక్కినేని అఖిల్‌ను పరిచయం చేస్తూ రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఈ సీజన్ అత్యంత క్రేజ్ ఉన్న సినిమాగా నిలబడింది. అక్కినేని వంశంలో పూర్తి స్థాయి మాస్ హీరో అనిపించుకోదగ్గ క్వాలిటీస్ ఉన్న నటుడిగా అఖిల్‌పై మొదట్నుంచీ విపరీతమైన ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అఖిల్ కోసమే సినిమాను చూసేయాలన్నంత క్రేజ్ కనిపించింది.

వీవీ వినాయక్ దర్శకత్వంలో, హీరో నితిన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. ఇక సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, గ్రాఫిక్స్ పరంగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం వినిపించినా, అఖిల్ మాత్రం కట్టిపడేశాడనే చెప్పుకోవచ్చు. డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో అఖిల్ ప్రతిభ చూసినవారంతా ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మరో స్టార్ వచ్చాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ వన్ మ్యాన్ షోగా ఈ సినిమాకు పేరొచ్చింది. ఇక మొదటి సినిమాతోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో ఈ స్థాయి పేరు తెచ్చుకున్న అఖిల్, అక్కినేని ఫ్యామిలీకి కొత్త స్టార్‌గా అవతరించే అవకాశమున్న హీరోగానే కనిపిస్తున్నారనడంలో సందేహం లేదు.

తాజా వార్తలు