నాగ్ బర్త్ డే రోజు అఖిల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడా ?
Published on Jul 30, 2018 5:32 pm IST


యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం లో నటిస్తున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ లండన్లో జరుగుతుంది. త్వరలోనే ఈ షెడ్యూల్ ముగించుకుని చిత్ర యూనిట్ ఇండియా తిరిగిరానుందని సమాచారం.

ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ ను కింగ్ నాగార్జున బర్త్ డే సంధర్బంగా ఆగష్టు 29న విడుదలచేయాడనికి ప్లాన్ చేస్తున్నారని చిత్ర వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది.
నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం యొక్క టైటిల్ కోసం మిస్టర్ మజ్ను అనే పేరును పరిశీలిస్తున్నారు . తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook