ఓవర్సీస్ లోనూ ‘అఖిల్’ గ్రాండ్ రిలీజ్

ఓవర్సీస్ లోనూ ‘అఖిల్’ గ్రాండ్ రిలీజ్

Published on Nov 10, 2015 3:00 PM IST

akhil
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హాపెనింగ్ నేమ్ అఖిల్ అక్కినేని.. దానికి ప్రధాన కారణం అక్కినేని ఫ్యామిలీ మూడవతరం హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండడం. దాంతో అటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లో అఖిల్ మొదటి సినిమాతో ఏ మేరకు ఆకట్టుకుంటాడా అనే ఆసక్తి నెలకొంది. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ చేసిన మొదటి సినిమా ‘అఖిల్’ దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ కానుంది. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాని కేవలం 130 నిమిషాల (2 గంటల 10 నిమిషాల)రన్ టైంతో రిలీజ్ చేయనున్నారు.

అఖిల్ – వినాయక్ క్రేజ్ వలన అఖిల్ సినిమా టికెట్స్ కి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఆంధ్ర, నైజాంలో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అఖిల్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అఖిల్ సినిమా ఓవర్సీస్ లో 150కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవుతుండడం విశేషం. అఖిల్ కి మొదటి సినిమా అయినప్పటికీ అఖిల్ యుఎస్ లో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేయడం వలన ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ని నితిన్ నిర్మించాడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా స్టేటస్ ఏంటనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు