
అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇక ఈ మధ్యే స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థాయ్‌లాండ్‌కు షిఫ్ట్ కానుంది. స్పెయిన్ షెడ్యూల్‌లో పలు అందమైన లొకేషన్లలో పాటలు, కొన్ని కీలక ఫైట్లను చిత్రీకరించారు.
తాజాగా స్పెయిన్ షెడ్యూల్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను ఈ ఉదయం విడుదల చేశారు. అక్కినేని వంశంలో మూడో తరంలో పరిచయమవుతోన్న అఖిల్ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూపొందుతున్న విషయం ఈ మేకింగ్ వీడియో ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ మేకింగ్ వీడియాను బట్టి చూస్తే అఖిల్ ఈ సినిమాలో ఫైట్లు, డ్యాన్సులు ఇరగదీశాడనే విషయం తెలిసిపోతుంది. ఇక ఈ వీడియో చూశాక అభిమానులు అఖిల్‌ను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా? అని ఆతృతగా ఎదురుచూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అఖిల్ సినిమా మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

