మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ బూస్ట్‌తో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు.
ఈ కాంబోలో రాబోయే సినిమా తన వయసుకు తగినట్లు ఉండే ఒక విభిన్నమైన ప్రేమకథగా ఉండబోతుందని వరుణ్ తేజ్ తెలిపారు. కార్తీక్ సుబ్బరాజు మార్క్ శైలికి భిన్నంగా, ఇది చాలా కొత్త కోణంలో సాగే లవ్ స్టోరీగా ఉండబోతోందని ఆయన ఇటీవల తెలిపారు.
వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన కార్తీక్ సుబ్బరాజు, వరుణ్ తేజ్‌ను ఈ కొత్త తరహా ప్రేమకథలో ఎలా చూపించబోతున్నాడనే దానిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
