రీసెంట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో నూతన నటీనటులు ఘట్టమనేని జై కృష్ణ అలాగే బాలీవుడ్ బ్యూటీ రాశా తడాని హీరో హీరోయిన్స్ గా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. అయితే ఆడియో పరంగా మంచి హిట్ అయ్యిన ఈ సినిమా థియేటర్స్ లో అనుకున్న రేంజ్ లో రాణించలేదు.
దీనితో ఆ బాధ్యతను తను తీసుకుంటున్నాను అని దర్శకుడు తెలిపారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందులో ఇవాళ్టి నుంచి పాన్ ఇండియా భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు మిస్ అయ్యిన వారు ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సాలిడ్ మ్యూజిక్ అందించగా వైజయంతి మూవీస్ సమర్పణలో సినిమా ముందుకు వచ్చింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
