అఖిల్ ప్లాన్ చేసిన భారీ ప్రీ ప్రమోషనల్ టూర్ డీటైల్స్

అఖిల్ ప్లాన్ చేసిన భారీ ప్రీ ప్రమోషనల్ టూర్ డీటైల్స్

Published on Sep 1, 2015 11:19 AM IST

Akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న మూడవ తరం యంగ్ హీరో అఖిల్ అక్కినేని. టాలీవుడ్ స్టార్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో అఖిల్ నటిస్తున్న మొదటి సినిమా ‘అఖిల్’. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని నాగార్జున బర్త్ డే కానుకగా ఆగష్టు 29న రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో అఖిల్ చేసిన రిస్కీ స్టంట్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమా పై భారీ క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్ వల్ల బిజినెస్ కూడా చాలా జోరుగా సాగుతుందని ఇది వరకే తెలియజేశాం.

క్రేజ్ బాగున్నా అఖిల్ మాత్రం తన మొదటి సినిమా విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా భారీ ఎత్తున ప్రమోట్ చెయ్యడానికి వ్యూహరచన కూడా చేసుకున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కి ముందే బాలీవుడ్ స్టైల్ లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషనల్ టూర్ వెయ్యడానికి ప్లాన్ చేసాడు. అఖిల్ చెప్పిన సమాచారం ప్రకారం ‘బాలీవుడ్ స్టైల్ లో ఈ సినిమా మార్కెటింగ్ ని ప్లాన్ చేసాం. అందులో భాగంగానే గ్రాండ్ ప్రీ రిలీజ్ టూర్ ప్లాన్ చేసాం. రిలీజ్ కి ముందు నేను, నా చిత్ర టీం అంతా కలిసి యుఎస్ లోని 3 సిటీలలో పయనిస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లతో కలుపుకొని మొత్తం 5 నగరాల్లో పయనించనున్నామని’ అఖిల్ తెలిపాడు. సినిమా రిలీజ్ కి ముందే యుఎస్ లో కూడా టూర్ ప్లాన్ చేస్తుండడం ప్రమోషన్స్ లో కొత్త ఒరవడి అని చెప్పుకోవాలి.

అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాని నితిన్ నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి అందించిన మ్యూజిక్ ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు