‘అల్లుడు శీను’పై అఖిల్ ప్రసంశలు

‘అల్లుడు శీను’పై అఖిల్ ప్రసంశలు

Published on Jul 4, 2014 2:20 PM IST

akhil-alludu-srinu
‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ పై సినిమా ప్రముఖుల ప్రసంశల జల్లు కురుస్తుంది. ఆడియో విడుదల రోజునే శ్రీనివాస్ ఇరగాదీశాడు అంటూ సినిమా ప్రముఖులు సాయి శ్రీనివాస్ ప్రతిభ గురించి పొగిడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో యంగ్ హీరో చేరాడు. అక్కినేని వారసుడు అఖిల్ ‘అల్లుడు శీను’ ట్రైలర్ బాగుందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

‘అల్లుడు శీను’ ట్రైలర్ చూశాను. శ్రీనివాస్ చాలా బాగా చేశాడు. అతని డాన్సు మూవ్స్ సూపర్బ్. వివి వినాయక్ గారికి మరియు ‘అల్లుడు శీను’ టీం అందరికీ అల్ ది బెస్ట్. శ్రీనివాస్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అని ట్వీట్ చేశాడు.

శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్’గా నటించిన ‘అల్లుడు శీను’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తమన్నా ప్రత్యెక గీతంలో నటించింది. ఇటివల విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తుంది. త్వరలో సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు