సెంచరీ కొట్టేసిన ‘లెనిన్’.. అఖిల్ మొదటి 100 కోట్ల సినిమా

సెంచరీ కొట్టేసిన ‘లెనిన్’.. అఖిల్ మొదటి 100 కోట్ల సినిమా

Published on Jul 30, 2026 2:34 PM IST

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామార్ గా నిలిచి సాలిడ్ ఓపెనింగ్స్, వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ చిత్రంతో అఖిల్ 100 కోట్ల గ్రాసర్ ని అందుకుంటాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. కానీ ఫైనల్ గా మేకర్స్ ఈ చిత్రం అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గానే కాకుండా తన మొదటి 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది. దీనితో అఖిల్ సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శత్రు తదితరులు నటించారు. అలాగే కింగ్ నాగార్జున మరియు సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు