సక్సెస్ కోసం ‘అఖిల్’ టీం స్పెషల్ ప్రార్ధనలు

akhil
టాలీవుడ్ లో సెంటిమెంట్స్ ఎక్కువగానే చూస్తుంటాం.. రిలీజ్ కి ముందు ప్రత్యేక దేవాలయాలను సందర్శించి తమ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ‘అఖిల్’ టీం తిరుమలేశుని సందర్శించి స్పెషల్ ప్రార్ధనలు చేసారు. ఇక విషయంలోకి వెళితే.. నాగార్జున ఫ్యామిలీ హీరోస్ తమ సినిమాల రిలీజ్ టైంలో ఎక్కువగా తిరుమలేశుని సందర్శించి పూజలు చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ఆనవాయితీని అక్కినేని మూడవ తరం హీరో అఖిల్ కూడా పాటిస్తున్నాడు.

అఖిల్ నటించిన మొదటి సినిమా ‘అఖిల్’ రేపు దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇకపోతే ఈ రోజు తెల్లవారు జామునే తిరుపతి చేరుకున్న అఖిల్ కాలినడకన వెళ్లి విఐపి దర్శన సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసాడు. అఖిల్ తో వివి వినాయక్ మరియు అతని టీం కూడా ఈ పూజా కార్యక్రమాలకు హాజరయ్యాడు. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన అఖిల్ ‘శ్రీవారి ఆశీస్సులతో ‘అఖిల్’ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నానని’ అన్నాడు.

వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ తో పాటు హీరోయిన్ గా సయేషా సైగల్ కూడా హీరోయిన్ గా పరిచయం కానుంది. నితిన్ నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించగా, మణిశర్మ నేపధ్య సంగీతం అందించాడు.

Exit mobile version