
గత కొద్ది రోజులుగా అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అఖిల్’. దానికి ప్రధాన కారణం అక్కినేని ఫ్యామిలీ మూడవ తరం వారసుడు, నాగార్జున – అమల తనయుడు అఖిల్ అక్కినేని ఆ సినిమాతో హీరోగా పరిచయం అవుతూ ఉండడం. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని దీపావళి కానుకగా నవంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది.
సిజి వర్క్ పెండింగ్ వల్ల అఖిల్ రిలీజ్ కాస్త ఆలస్యం అయ్యింది. ఇప్పుడు అన్ని వర్క్స్ ని ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం ఫైనల్ ఫస్ట్ కాపీని సిద్దం చేసారు. అలాగే ఈ రోజు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఫినిష్ చెయ్యాలని ఈ రోజు సెన్సార్ లో స్లాట్ కూడా బుక్ చేసారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ రోజు సాయంత్రానికి అఖిల్ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తమిళంలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.