
ఇండియాలో ప్రతి ఏడాది చాలా గ్రాండ్ గా జరిగే చలన చిత్ర అవార్డ్స్ వేడుకల్లో ఐఫా(ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ ఒకటి. మొదటి సారి ఐఫా వారు సౌత్ ఇండియన్ సినిమాలకి కూడా అవార్డ్స్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ సౌత్ ఇండియన్ ఐఫా ఉత్సవమ్ అవార్డ్స్ వేడుకని డిసెంబర్ 5,6వ తేదీలలో హైదరాబాద్లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకి అల్లు శిరీష్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ వేడుకలో మరికొన్ని మెమొరబుల్ మోమెంట్స్ కూడా చోటు చేసుకోనున్నాయి.
ఆ విషయంలోకి వెళితే.. ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయ్యి తన డాన్సులతో ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన హీరో అఖిల్. మొదటిసారి అఖిల్ వర్డ్స్ వేడుకలో డాన్స్ వేయడానికి సిద్దమవుతున్నాడు. అఖిల్ ఐఫా ఉత్సవమ్ లో తెలుగు అవార్డ్స్ రోజున స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం పాపులర్ కోరియోగ్రాఫర్స్ అఖిల్ కి డాన్స్ కంపోజ్ చేస్తున్నారు. మొదటిసారి ఐఫా వారు చేస్తున్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేసారు.