రఫ్ లుక్ కోసం అఖిల్ కసరత్తులు !

Akhil2

అక్కినేని అఖిల్ తన కొత్త సినిమా కొత్త మేక్ ఓవర్ అయినట్టు తెలుస్తోంది. ఆ మధ్య తన లుక్ తో పాటు పర్ఫెక్ట్ బాడీతో అభిమానులను ఆశ్చర్యపరిచిన అఖిల్.. ఇప్పుడు తన కొత్త యాక్షన్ మూవీ రఫ్ లుక్ లోకి మారడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తోన్నట్లు తెలుస్తోంది. మరి, యాక్షన్ మూవీలో మాస్ లుక్ లో అఖిల్ ఎలా ఉంటాడో చూడాలి. మరి అఖిల్ చేస్తోన్న తన తదుపరి యాక్షన్ మూవీ అయినా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతొంది.

కాగా ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందట. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

Exit mobile version