
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నవతరం యంగ్ హీరో అక్కినేని అఖిల్. మనం సినిమాలో చివర్లో ఒక్క నిమిషం కనిపించి తన మాస్ అప్పియరెన్స్, స్క్రీన్ ప్రెజన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అఖిల్ హీరోగా పరిచయం అవుతూ తన మొదటి సినిమాని వివి వినాయక్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మాకు మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం అఖిల్ ఫస్ట్ మూవీ నైజాం రైట్స్ 13 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయాయి. అది కూడా దేవీ ఫిల్మ్స్ అధినేత శ్రీనివాస్ నైజాం రైట్స్ సొంతం చేసుకున్నాడు. శ్రీనివాస్ బాహుబలిని కర్ణాటక రైట్స్ తీసుకున్నాడు. ఆ సినిమా అక్కడ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో శ్రీనివాస్ ఈ క్రేజీ మూవీ రైట్స్ ని దక్కించుకున్నాడు. మరోవైపు ఒక డెబ్యూ హీరో రైట్స్ ఈ రేంజ్ కి అమ్ముడు పోవడం ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేస్తున్నాయి. స్టార్డం ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ సినిమాలు ఈ రేంజ్ రేటుకి అమ్ముడి పోతాయి. కానీ అఖిల్ మొదటి సినిమానే ఈ రేంజ్ కి అమ్ముడు పోవడం అందరినీ షాక్ కి గురు చేస్తోంది.
అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం ఉన్న ఈ సినిమా షూటింగ్ 85% పూర్తయ్యింది. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

