‘బ్యాచ్‌ల‌ర్’ రిలీజ్ డేట్ పై పునరాలోచనలు !

‘బ్యాచ్‌ల‌ర్’ రిలీజ్ డేట్ పై పునరాలోచనలు !

Published on Mar 29, 2021 4:45 PM IST

అక్కినేని అఖిల్ – పూజా హెగ్డే కలయికలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా పై అక్కినేని అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతోన్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. ఫస్ట్ కాపీతో రెడీగా ఉందట. అయితే రిలీజ్ డేట్ ను మేకర్స్ మార్చేలా కనిపిస్తున్నారు. సోలో రిలీజ్ కోసం దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నారట. మరి సోలో రిలీజ్ అంటే డేట్ దొరుకుంతుందా చూడాలి.

కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు