షూట్ షురూ చేసిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” టీం

Published on Sep 15, 2020 5:30 pm IST

తన సినిమా ఫలితం తో సంబంధం లేకుండా తన తర్వాత సినిమాకు మంచి హైప్ తెచ్చుకోవడం ఇప్పుడున్న యువ హీరోల్లో అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ కి చెల్లిందని చెప్పాలి. తన మొదటి సినిమా నుంచి కూడా సరైన హిట్ లేనప్పటికీ తాను ఇప్పుడు చేస్తేన్న చిత్రాలకు మంచి హైప్ వచ్చింది.

వాటిలో ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న చిత్రం “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” చిత్రం కూడా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా వరకు షూట్ ను కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ మూలాన అన్ని చిత్రాల్లానే వాయిదా పడ్డ ఈ చిత్ర షూటింగ్ తిరిగి మళ్లీ 6 నెలల తర్వాత మొదలయ్యింది.

తగు జాగ్రత్తలు తీసుకొంటు దర్శకుడు భాస్కర్, అఖిల్ మరియు హీరోయిన్ పూజా హెగ్డేలు షూట్ ను పునః ప్రారంభించారు. అందుకు సంబంధించిన ఫోటోలను పూజా హెగ్డే రివీల్ చేసింది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More