
అక్కినేని ఫ్యామిలీ మూడవ తరం నటవారసుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని. టాలీవుడ్ స్టార్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ నటించిన మొదటి సినిమా ‘అఖిల్’కి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ సినిమా విషయంలోనే కాకుండా సినిమా ప్రీ అండ్ పోస్ట్ ప్రమోషన్స్ ని కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని ఇదివరకే తెలియజేశాం. అందులో భాగంగా మునుపెన్నడూ ఏ హీరో, ఏ సినిమా టీం చేయని విధంగా యుఎస్ లో కూడా ప్రీ ప్రమోషనల్ టూర్ చేపట్టనున్నారని ఇది వరకే తెలియజేశాం. ఈ ప్రమోషనల్ టూర్ ని మరింత స్పెషల్ గా తీసుకున్న అఖిల్ ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని రేర్ ఫీట్ చేయనున్నాడు.
ప్రీ ప్రమోషనల్ టూర్ విషయం గురించి అఖిల్ చెబుతూ ‘త్వరలోనే అమెరికాలోని పలు మేజర్ సిటీస్ లో అఖిల్ ప్రమోషన్స్ చేయనున్నాం. అంతే కాకుండా సినిమా రిలీజ్ అయ్యాక కూడా ముందుగా యుఎస్ లోనే పోస్ట్ ప్రమోషన్స్, సక్సెస్ టూర్ చేసి ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తామని తెలిపాడు. మొదటి సారిగా యుఎస్ లో ప్రీ అండ్ పోస్ట్ ప్రమోషన్స్ చేస్తున్న హీరోగా అఖిల్ రేర్ ఫీట్ చేస్తున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాని నితిన్ నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి అందించిన మ్యూజిక్ అందించిన ఈ సినిమాని అక్టోబర్ 22న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

