హిట్ మెషిన్‌గా పేరొందిన అనిల్ రావిపూడి ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేశాడు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అన్ని చోట్ల హౌస్‌ఫుల్స్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంతో చిరంజీవిలోని వింటేజ్ ఎనర్జీని తిరిగి తెరపై చూపించడంలో అనిల్ రావిపూడి పూర్తిగా విజయం సాధించాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్‌ను హ్యాండిల్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
సినిమా విజయం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. ఇదే సమయంలో అక్కినేని అభిమానులు (Akkineni Fans) అనిల్ రావిపూడి ముందు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారు. నాగార్జున హీరోగా ‘హలో బ్రదర్’ తరహా ఫుల్ లెంగ్త్ కామిక్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. నాగ్ స్టైల్‌కు అనిల్ కామెడీ టైమింగ్ సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అనిల్ రావిపూడి కూడా నాగార్జునను దర్శకత్వం వహించాలని తనకు చాలా ఇష్టమని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన కమిట్ అయిన ప్రాజెక్టుల కారణంగా ఈ కాంబినేషన్ వెంటనే సెట్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌ను తెరకెక్కించాల్సి ఉండగా, మరోవైపు నందమూరి బాలకృష్ణతో కూడా ఓ సినిమా లైనప్‌లో ఉంది. అయినప్పటికీ, భవిష్యత్తులో అనిల్-నాగార్జున కలయిక జరిగితే అదో స్పెషల్ ట్రీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
