బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించి ‘కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్’గా నిలిచిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. సినిమాకు లభిస్తున్న విశేష ఆదరణకు కృతజ్ఞతగా ఈ విజయాన్ని అభిమానులు, మీడియా సమక్షంలో జరుపుకోవడానికి టీమ్ సిద్ధమైంది.
ఇక ఈ సక్సెస్ మీట్ వేడుక జూలై 28న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో వైభవంగా జరగనుంది. కాగా ఈ గ్రాండ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా అక్కినేని నాగచైతన్య హాజరు కానున్నాడు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియా, దర్శకుడు రవి నంబూరి, నిర్మాతలు సాయి రాజేష్, ఎస్‌కేఎన్ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు.


