ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అక్షయ్, సుధ కొంగర ప్రాజెక్ట్

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అక్షయ్, సుధ కొంగర ప్రాజెక్ట్

Published on Feb 13, 2024 1:06 PM IST


కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్య హీరోగా చేసిన పలు ఎమోషనల్ హిట్ చిత్రాల్లో దర్శకురాలు సుధా కొంగర తో చేసిన ఓటిటి హిట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” కూడా ఒకటి. మరి తమిళ్ లో “సూరారై పొట్రు” గా తెరకెక్కి ఇతర భాషల్లో డబ్ అయ్యిన ఈ చిత్రం కోవిడ్ సమయంలో నేరుగా ఓటిటిలో వచ్చిన నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని అయితే బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తో సుధా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ సహా సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి మేకర్స్ “సఫారీయా” అనే బ్యూటిఫుల్ టైటిల్ ని పెట్టగా చిన్న గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అక్షయ్ పై చిన్న సీన్స్ చూపించారు. ఇక ఫైనల్ గా ఈ చిత్రాన్ని అయితే ఈ జూలై 12న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి హిందీ ప్రేక్షకులని ఈ ఎమోషనల్ డ్రామా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు