లక్ష్మీ బాంబ్ ఓ టి టి లో పేలనుందా?

Published on May 29, 2020 8:33 am IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ ఓ టి టి లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. కొరియోగ్రాఫర్ కం హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో ఆయన లక్ష్మీ బాంబ్ అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యింది. లాక్ డౌన్ లేకపోతే రంజాన్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఐతే లాక్ డౌన్ తో చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

కాగా షూటింగ్స్ మొదలు అయినప్పటికీ థియేటర్స్ బంద్ కారణంగా ఇప్పట్లో మూవీ విడుదల చేసే పరిస్థితి లేదు. దీనితో లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని ఓ టి టి లో విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారట. మిగిలిన షూటింగ్ పూర్తి చేసి, త్వరగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి తేవాలనేది అక్షయ్ ఆలోచనట. ఇక తెలుగు తమిళ భాషలో విజయం సాధించిన కాంచన చిత్రానికి హిందీ రీమేక్ గా లక్ష్మీ బాంబ్ తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం :

More