2010లో మొదలైన హౌస్ ఫుల్ మూవీ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 చిత్రంలోని అక్షయ్ కుమార్ లుక్ నేడు విడుదల చేయడం జరిగింది. రెండు విభిన్న గెటప్స్ లో ఉన్న అక్షయ్ లుక్ అభిమానులకు కిక్కెక్కించేదిగా ఉంది. గోడపై ఉన్న ఫొటోలో ఒకనాటి జమిందారు గెటప్ లో ఉన్న అక్షయ్, మరొక గెటప్ లో మోడరన్ గా ఉన్నారు. హౌస్ ఫుల్ సక్సెస్ సిరీస్ లో కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో కృతి సనన్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్, కృతి కర్బంద, పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ ఫిలిమ్స్, మరియు సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి కానుకగా హౌస్ ఫుల్ 4 విడుదల కానుంది.



