13 రోజుల్లో 177 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు

13 రోజుల్లో 177 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు

Published on Jan 9, 2020 7:10 PM IST

Akshay

దర్శకుడు రాజ్ మెహతా రూపొందించిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గుడ్ న్యూస్ మూవీ వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది. విడుదలై రెండు వరాలు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతుంది. కాగా ఈచిత్రం విడుదలైన 13 రోజులకు గాను 177.31 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ వారాంతానికి గుడ్ న్యూస్ మూవీ 200కోట్ల మార్కు చేరుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన రెండు జంటల విషయంలో జరిగిన పొరపాటు కారణంగా జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, ధిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ 2019 ని గుడ్ న్యూస్ విజయంతో ముగించింది. ఇక గత ఏడాది అక్షయ్ నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా అన్ని చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4 చిత్రాలు 200కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు