బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫాలోయింగ్ ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. సినిమా జస్ట్ ఓకే అనే స్థాయిలో ఉన్నా కూడా తన స్టార్ డమ్ మీద దాన్ని విజయతీరాలకు చేరుస్తున్నాడు అక్షయ్. అయితే తన తాజా చిత్రం ‘హౌస్ ఫుల్ 4’ మీద విమర్శలు రావడంతో ఈసారి చేయబోయే కామెడీ ఎంటర్టైనర్ పూర్తిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలని భావించి తనకిష్టమైన దర్శకుడు ప్రియదర్శన్ తో చేతులు కలుపుతున్నాడట.
ప్రియదర్శన్ కూడా తన ఫేవరెట్ నటుడితో చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నానని, ప్రస్తుతం కథను రెడీ చేస్తున్నానని అంటున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘భాగమ్ భాగ్, దే ధనా ధన్, కట్టా మీటా, గరమ్ మసాలా’ లాంటి సినిమాలు చేసి ఉండటంతో వీరు చేయబోయే కొత్త ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.


