ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు

ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు

Published on Apr 25, 2024 12:59 PM IST


గత ఏడాది బాలీవుడ్ (Bollywood Cinema) డెలివర్ చేసిన పలు హిట్ చిత్రాల్లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akashay Kumar) అలాగే వెర్సటైల్ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన చిత్రం “ఓ మై గాడ్ 2” కూడా ఒకటి. మరి దీనికి మొదటి భాగాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకీ మామ లు “గోపాల గోపాల” గా రీమేక్ చేశారు.

అయితే హిందీలో చాన్నాళ్ళకి సీక్వెల్ గా దర్శకుడు అమిత్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి హిట్ అయ్యింది. అయితే వసూళ్లు హిట్ అనే వాటికంటే ఈ సినిమా ద్వారా మేకర్స్ ఇచ్చిన సందేశానికి ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. దీనితో ఓటిటిలో చాలా మంది చూద్దాం అనుకున్నారు.

కానీ నెట్ ఫ్లిక్స్ లో కేవలం ఒరిజినల్ హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా రీజనల్ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. మరి తెలుగు సహా మరాఠి, తమిళ్ మరియు బంగ్లా భాషల్లో జియో సినిమాలో అయితే ఈ సినిమా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునే వారు తప్పకుండా జియో సినిమాలో ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు