ఏడాదిలో 700కోట్లు కొల్లగొట్టిన హీరో

ఏడాదిలో 700కోట్లు కొల్లగొట్టిన హీరో

Published on Jan 3, 2020 11:16 AM IST

akshy

అక్షయ్ కుమార్ 2019లో నాలుగు సినిమాలు విడుదల చేశారు. కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4 తాజాగా గుడ్ న్యూస్. ఈ నాలుగు చిత్రాలు బాక్సాపీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. 2019గాను అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ మూవీస్ లో అక్షయ్ కుమార్ నటించిన మూడు చిత్రాలు చోటు సంపాదించడం గమనార్హం. అక్షయ్ లేటెస్ట్ రిలీజ్ గుడ్ న్యూస్ కూడా బాక్సాపీస్ దుమ్ము దులుపుతుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు రోజులలో 117.10 కోట్ల వసూళ్లు సాధించింది.

గుడ్ న్యూస్ మూవీ 150కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతుంది. మొత్తంగా అక్షయ్ కుమార్ తన చిత్రాల ద్వారా 2019గాను 700కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ఇక ఈ ఏడాది కూడా దాదాపు మరో నాలుగు చిత్రాలు లైన్ లో పెట్టారు. సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, పృథ్వీ రాజ్ అనే చిత్రాలతో పాటూ మరో చిత్రం ఆయన చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు