అక్షయ్ కుమార్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది అనడానికి ఇదే నిదర్శనం. ఆయన 2019లో నాలుగు సినిమాలు విడుదల చేశారు. కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4 తాజాగా గుడ్ న్యూస్. ఈ నాలుగు చిత్రాలు బాక్సాపీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. 2019గాను అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ మూవీస్ లో అక్షయ్ కుమార్ నటించిన మూడు చిత్రాలు చోటు సంపాదించడం గమనార్హం. అక్షయ్ లేటెస్ట్ రిలీజ్ గుడ్ న్యూస్ కూడా బాక్సాపీస్ దుమ్ము దులుపుతుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు రోజులలో 117.10 కోట్ల వసూళ్లు సాధించింది.
నిన్న బుధవారం ఓపెనింగ్ డే(17.56) కి మించి 22.50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఒకప్పుడు అక్షయ్ కుమార్ చిత్రాలకు వంద కోట్లు అంటే అదో పెద్ద టార్గెట్. కానీ ఈ మధ్య విడుదలైన అక్షయ్ అన్ని చిత్రాలు వంద కోట్ల వసూళ్లు అవలీలగా సాధిస్తున్నాయి. దర్శకుడు రాజ్ మెహతా గుడ్ న్యూస్ చిత్రాన్ని కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. కరీనా కపూర్, కియారా అద్వానీ, దిల్జీత్ ఇతర ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది.


