‘అల వైకుంఠపురములో’.. సిస్టర్ సెంటిమెంట్ !

‘అల వైకుంఠపురములో’.. సిస్టర్ సెంటిమెంట్ !

Published on Nov 6, 2019 3:00 AM IST

Ala Vaikunthapuramulo1

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆమె లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. లుక్ కూల్ గా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో టబు అల్లు అర్జున్ అక్కగా నటిస్తోందట. టబు లైఫ్ లో ఆమెకు ఎదురైన ఇబ్బందకరమైన సంగటనలను.. వాటిని బన్నీ ఎలా పరిష్కరించాడు అన్నదే ఈ సినిమా కథ అట. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రాబోతుంది అన్నమాట.

ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.

ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు