స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా మ్యూజిక్ కి సంబంధించి దాదాపు వర్క్ పూర్తయిందని.. ఈ రోజు నుంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి సంబంధించి వర్క్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. ఆ ప్లాష్ బ్యాక్ లో ఎమోషనల్ సన్నివేశాలు ఆలాగే బన్నీ స్క్రీన్ ప్రేజన్సీ అద్భుతంగా ఉంటాయట. ఇక అక్టోబర్ 8న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.


