స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ రోజు షూట్ తోటి ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ట్వీట్ చేసింది. కాగా ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్ ప్లాట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్స్ మొత్తానికి సినిమా పై ఉన్న భారీ అంచనాలు ఇంకా పెంచాయి.
పైగా ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#AlaVaikuntapurramuloo shoot is completed & exciting updates on the way till the release date.#AVPLFromJan12th @alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/hYrL3qG3E5
— Suresh PRO (@SureshPRO_) December 28, 2019


