‘అల వైకుంఠపురములో’ లాస్ట్ సాంగ్ పెద్ద ట్రీట్‌లా ఉంటుందట

‘అల వైకుంఠపురములో’ లాస్ట్ సాంగ్ పెద్ద ట్రీట్‌లా ఉంటుందట

Published on Dec 28, 2019 12:04 AM IST

Ala Vaikunthapuramulo1

ఈమధ్య కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాటలంటే అనుమానం లేకుండా ‘అల వైకుంఠపురములో’ పాటలనే అనాలి. సినిమా నుండి వచ్చిన అన్ని పాటలు బ్రహ్మండంగా హిట్టయ్యాయి. సామజవరగమన నుండి రాములో.. రాములా, ఓ మైగాడ్ డాడీ, బుట్ట బొమ్మ ఇలా నాలుగు పాటలు నాలుగు రకాలుగా ఆకట్టుకున్నాయి. దీంతో ఐదవ పాటను కూడా రెడీ చేస్తున్నారు.

శ్రీకాకుళం యాసలో ఉండబోయే ఈ ఫోక్ సాంగ్ మిగిలిన అన్ని పాటలకంటే బాగుటుందని, అందుకే సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు దాన్ని విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సామజవరగమన పాటతో ఆల్బమ్ కు ఎలాంటి గొప్ప స్టార్ట్ ఇచ్చారో ఈ ఫోక్ సాంగ్ తో అంతే గొప్ప ఎండింగ్ ఇవ్వాలనేది తమన్ అండ్ టీమ్ ఆలోచనట. మరి తమన్ సంధించనున్న చివరి పాట ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు