‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ రికార్డ్స్ భారీగా ఉండనున్నాయి

Ala Vaikunthapuramulo1

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. విడుదలైన పాటలు, టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాడించాయి. సంగీత దర్శకుడు తమన్ పనితనం మూలాన సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్ అయిపోయింది. ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు అయితే సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
సాధారణంగానే బన్నీ, త్రివిక్రమ్ సినిమాలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది.

అందుకే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. బన్నీ కెరీర్లో ఇదే అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కానుంది. దీంతో చిత్రం ప్రీమియర్లతో కలిపి మొదటి మూడు నాలుగు రోజుల్లోనే మిలియన్ డాలర్ మార్కును దాటిపోతుందని ట్రెడ్ వర్గాలు భావిస్తున్నాయి. హారిక, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుండగా సుశాంత్, జయరామ్, టబు, సముథిరఖని, నవదీప్, నివేత పేతురాజ్, సునీల్, మురళీ శర్మ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

Exit mobile version