‘అల వైకుంఠపురములో’.. లేటెస్ట్ అప్ డేట్ !

‘అల వైకుంఠపురములో’.. లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 3, 2020 2:01 AM IST

ala Vaikunthapuramlo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. తాజాగా సినీ వర్గాల సమాచరం ప్రకారం ఈ చిత్రం రేపు సాయంత్రం సెన్సార్ స్క్రీనింగ్ కోసం వెళ్లనుంది. ఇప్పటికే సెన్సార్ కోసం ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయట. కాగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెయిన్ ప్లాట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్స్ మొత్తానికి సినిమా పై ఉన్న భారీ అంచనాలు ఇంకా పెంచాయి.

పైగా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం కూడా బాగా కలిసి రానుంది, ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు