‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ పోస్టర్ !

‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ పోస్టర్ !

Published on Sep 1, 2019 10:10 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా ఫస్ట్ పోస్టర్ ను చిత్రబృందం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుదల చేసింది. రీచ్ కార్ పక్కన ఒక పాత స్టూల్ మీద వెరీ స్టైలిష్ సూట్ లో బ‌న్నీ కూర్చుని ఉండగా.. కార్ డ్రైవ‌ర్ బన్నీకి సిగ‌రెట్ అంటిస్తూ ఉన్నాడు. కాగా ప్ర‌స్తుతం ఈ ఫస్ట్ పోస్టర్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ మాటల తూటాలు కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లోని కామెడీనే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వీరిద్దరూ రాబోతున్నారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు