అల వైకుంఠపురంలో ఆరు రోజులకు వంద దాటేసింది

అల వైకుంఠపురంలో ఆరు రోజులకు వంద దాటేసింది

Published on Jan 18, 2020 8:30 PM IST

అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో రికార్డ్ కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలలో పాటు, యూఎస్ లో ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఇప్పటికే యూఎస్ లో $ 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దాటివేసిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 104 కోట్ల షేర్ వసూలు చేసింది. నేడు చిత్ర యూనిట్ ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. నేడు, మరియు రేపు సెలవు దినాలు కావడంతో ఈ చిత్ర వసూళ్ళ జోరు కొనసాగే అవకాశం కలదు.

అల వైకుంఠపురంలో మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి. బన్నీకి జంటగా పూజ హెగ్డే నటించగా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు వంటి వారు కీలక రోల్స్ చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు