అల వైకుంఠపురంలో నుండి మరో సాంగ్…!

ala Vaikunthapuramlo

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురంలో పై హైప్ మామూలుగా లేదు. పాటలతోనే ప్రచారానికి పదును పెట్టిన టీమ్ సూపర్ సక్సెస్ ఐయ్యింది. అలవైకుంఠపురంలో చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఆయన స్వరకల్పనలో వచ్చిన రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. దీనితో ఈ మూవీ నుండి ముచ్చటగా మూడవ సాంగ్ కూడా రానుంది. దాని వివరాలు ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాలకు తెలుపనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నిర్మాతలు తెలియజేశారు.

ఇక అలవైకుంఠపురంలో చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో అందమైన ప్రదేశాలలో సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. పూజా ఈ మూవీలో బన్నీ కి లేడీ బాస్ పాత్ర చేస్తుండగా సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అలవైకుంఠపురంలో మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

Exit mobile version