అలవైకుంఠపురంలో రికార్డ్స్ మొదలయ్యాయిగా

అలవైకుంఠపురంలో రికార్డ్స్ మొదలయ్యాయిగా

Published on Sep 28, 2019 7:07 PM IST

నేడు అలవైకుఠపురంలో చిత్రంలోని ఒక సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఎస్ ఎస్ థమన్ స్వరకల్పనలో సిరివెన్నెల సాహిత్యంతో సిద్ శ్రీరామ్ మధుర గానంతో రూపొందిన ఆపాట అద్భుత స్పందన దక్కించుకుంటుంది. మనసుకు హత్తుకునేలా మెలోడియస్ గా ఉన్న ఈ పాట యూట్యూబ్ లో సంచలనాలు చేస్తుందని సమాచారం. విడుదలైన ఆరు గంటలలో రెండు లక్షల లైక్స్ సాధించి రికార్డు నెలకొల్పింది. అలాగే ఇప్పటికే ఈ పాటను ఇరవై లక్షలకు పైగా వీక్షించడం విశేషం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్,టబు కీలక పాత్రలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు