యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో అల్లు అర్జున్ ప్రభంజనం

యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో అల్లు అర్జున్ ప్రభంజనం

Published on Jan 12, 2020 7:00 PM IST

సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాల్లో సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ కలెక్షన్స్ ని అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 8లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సరిలేరు నీకెవ్వరు 252 ప్రదేశాల్లో విడుదలై 7.64 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు