‘రామ్ లీల’కి హైలైట్ కానున్న అలీ – సప్తగిరిల కామెడీ

ali-and-saptagiri
‘నువ్విలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘జీనియస్’తో తన లోని టాలెంట్ ని చూపిన యంగ్ హీరో హవీష్ చేసిన మరి లేటెస్ట్ మూవీ ‘రామ్ లీల’. హవీష్ తో పాటు అభిజిత్, నందిత నటీనటులుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించాడు. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికే అందుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న అనగా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో కథతో పాటు రెండు కామెడీ ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్స్ ని అలీ, సప్తగిరి కలిసి చేసారు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన కాండీ ట్రాక్స్ ఆద్యంతం నవ్విస్తాయని సమాచారం. చిన్నా మరియు శివమణి కలిసి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బజ్ ఉండడం సినిమాకి బాగా హెల్ప్ అవుతోంది. మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

Exit mobile version