‘సిటీమార్’లో ఆలీనే హైలైట్ అట !

‘సిటీమార్’లో ఆలీనే హైలైట్ అట !

Published on Feb 28, 2021 6:44 PM IST

సీనియర్ కమెడియన్ ఆలీ అంటేనే మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆలీకి ఓ సినిమాలో అదిరిపోయే కామెడీ క్యారెక్టర్ పడిందట. అదే గోపీచంద్‌ ప్రస్తుతం చేస్తోన్న ‘సిటీమార్’ సినిమా. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని.. ఆ పాత్రలోనే ఆలీ నటిస్తున్నాడని తెలుస్తోంది.

మరి ఆలీ ఈ చిత్రంతో ఎలాంటి నవ్వులు పూయిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో సినిమా చేశాడట సంపత్ నంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు