అరుదైన ఘనత సాధించిన ఆలియా.. డీటెయిల్స్ ఇవే

అరుదైన ఘనత సాధించిన ఆలియా.. డీటెయిల్స్ ఇవే

Published on Apr 18, 2024 8:06 AM IST

బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ మన టాలీవుడ్ సెన్సేషన్ గ్లోబల్ హిట్ “రౌద్రం రణం రుధిరం” (RRR Movie) తో అందరికీ బాగా తెలుసు. మరి గ్లామర్ పరంగానే కాకుండా ఒక నటిగా కూడా ఆలియా భట్ ఎన్నో చిత్రాల్లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబర్చింది. అలా ఒక్క నేషనల్ వైడ్ గానే కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీ కూడా ఆమె ఇచ్చింది. గత ఏడాదిలోనే “హార్ట్ ఆఫ్ స్టోన్” అనే హాలీవుడ్ సినిమాలో మెరిసిన ఆలియా లేటెస్ట్ గా మరో అరుదైన ఘనత అందుకుంది.

ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ అయినటువంటి టైమ్స్ 100 లో భారత్ నుంచి ఏకైక నటిగా చోటు సంపాదించుకుంది. దీనితో మరోసారి ఇండియా వైడ్ గా ఆలియా పేరు వైరల్ గా మారింది. అయితే సినిమా పరంగా ఆలియా పేరు సహా మరికొన్ని విభాగాల్లో మరికొందరు భారతీయులు ఈ టాప్ 100 లో స్థానం దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా, అలాగే నటుడు – దర్శకుడు దేవ్ పటేల్, ఇంకా రెజ్లర్ సాక్షి మాలిక్ అలాగే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లలు ఈ లిస్ట్ లో నిలిచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు