లవ్ సీన్స్ కోసం ఆలియా భట్ రెడీ !

Published on Mar 8, 2021 1:30 pm IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో క్రేజీ బ్యూటీ ఆలియా భట్, చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)‌’ సెట్స్‌లోకి జాయిన్ అవ్వడానికి సిద్ధ‌మైంది.

ఇప్పటికే ఆలియా భ‌ట్ మీద కొన్ని స‌న్నివేశాల‌ను రాజ‌మౌళి చిత్రీక‌రించాడు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్ మీద కొన్ని ప్రేమ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. పైగా ఆలియా ఈ లాక్ డౌన్ లో ఈ సినిమా కోసం తెలుగును కూడా నేర్చుకుందట. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి వస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :