ఆలియా లుక్ కోసం ఆసక్తిగా అభిమానులు !

ఆలియా లుక్ కోసం ఆసక్తిగా అభిమానులు !

Published on Mar 15, 2021 12:02 AM IST

rrr 1
నేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తోన్న తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆమె లుక్ మార్చి 15న ఉదయం 11 గంటలకు రివీల్ కాబోతుందంటూ వదిలిన స్టిల్ చాల బాగుంది. శాంపిల్ స్టిల్ నే ఇలా ఉంటే ఇక పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు