బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ భారీ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ఆమె ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తుండగానే.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న ‘గంగూబాయి కాఠియావాడీ’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సంగతిని అలియా స్వయంగా సోషల్ మీడియా మాధ్యమంలో వెల్లడించారు.
కాగా సంజయ్ లీలా బన్సాలీ ‘పద్మావత్’ తరువాత ‘గంగూబాయి కాఠియావాడీ’ రూపొందిస్తున్నారు. ముంబై చరిత్రలో గంగూబాయి చర్చనీయమైన మహిళగా నిలిచారు. కాగా ఈ సినిమా 2020 సెప్టెంబరులో విడుదల కానుంది. వీటితో పాటు హిందీలో రన్బీర్ సింగ్, అమితాబ్, నాగార్జున వంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా అలియా భట్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తుంది. ఇండియా లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటిస్తూ సత్తా చాటుతుంది.
