‘అలిమేలు మంగ’ షూటింగ్ అప్ డేట్ !

‘అలిమేలు మంగ’ షూటింగ్ అప్ డేట్ !

Published on Mar 21, 2021 11:03 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ ప్రస్తుతం చేస్తోన్న సిటీమార్ ఆల్ రెడీ పూర్తి అయి రిలిజ్ కి సిద్ధం అవుతుంది. అందుకే ‘అలిమేలుమంగ వేంకటరమణ’ను స్టార్ట్ చేయాలని గోపీచంద్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.

కాగా తేజ, గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట. అయితే ఇంతకీ అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను తేజ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు