“వీరమల్లు” ఫీస్ట్ క్లారిటీ కోసం అంతా వెయిటింగ్

“వీరమల్లు” ఫీస్ట్ క్లారిటీ కోసం అంతా వెయిటింగ్

Published on Mar 5, 2024 4:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఆగి చాలా కాలమే అయ్యింది కానీ మేకర్స్ మాత్రం సమయం దొరికినపుడు ఈ సినిమాపై కొన్ని రూమర్స్ కి చెక్ పెడుతూ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు.

అలా రీసెంట్ గానే మేకర్స్ సినిమాపై అప్డేట్ ఇస్తూ ఓ ప్రోమోని అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇది శివరాత్రి కనుకే అని అంతా ఫిక్స్ అయ్యారు అయితే ఇపుడు సమయం దగ్గరకి వస్తుంది కానీ మేకర్స్ అట్లీస్ట్ అలర్ట్ అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వడం లేదు. దీనితో ఈ సినిమా నుంచి క్లారిటీ కోసం అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి దీనిపై మేకర్స్ ఏమన్నా అప్డేట్ ఈ మధ్యలో ఇస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో అయితే ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు