ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య సినిమాపై ఉత్సుకత.!

Published on Mar 14, 2021 9:36 am IST

కోలీవుడ్ విలక్షణ నటులలో హీరో సూర్య కూడా ఒకరు. అటు తమిళ్ తో పాటుగా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సూర్య ఒక సరైన హిట్ కొడితే చూడాలని అంతా కోరుకున్నారు. మరి అతని అభిమానులు కోరుకున్న ఆ గట్టి కోరికను ఒక ఎక్స్టార్డినరీ చిత్రంతో తీర్చేసాడు.

మహిళా దర్శకురాలు సుధా కొంగరతో తీసిన “ఆకాశం నీ హద్దురా” తమిళ్ లో “సూరారై పొట్రు” అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ గా విడుదలై యూనానిమస్ హిట్టయ్యింది. ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి ప్రపంచ ప్రసిద్ద ఆస్కార్ రేస్ లో నిలిచి ఇండియన్ సినిమాకు గర్వకారణంగా మారింది.

మరి కొన్ని రోజుల కితమే ప్రపంచ వ్యాప్తంగా 366 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ సినిమా పేరు నిలవడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు అసలైన ఉత్సుకత నెలకొంది. ఆ 366 చిత్రాల నుంచి కూడా రేపు ఆస్కార్స్ నుంచి మరో చిట్ట చివరి ఫైనల్ లిస్ట్ రానుంది.

దీనితో ఈ లిస్ట్ లో సూర్య సినిమా నిలుస్తుందా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఆ లిస్ట్ లో నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. మనం కూడా ఈ చిత్రం ఆ జాబితాలో నిలవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :